అవినీతి, అక్రమాలే ధ్యేయంగా బాబు పాలన

రాష్ట్రవ్యాప్తంగా గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోంది. కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గ ఇంఛార్జ్ బుడ్డా శేషారెడ్డి కోరుకొండలో గడపగడపలో పర్యటించారు. పత్తికొండ నియోజకవర్గ ఇంఛార్జ్ సిహెచ్. నారాయణరెడ్డి ఆధ్వర్యంలో వెల్దుర్తి పట్టణంలో, నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య ఆధ్వర్యంలో ఎమ్. గనపురం, ఎన్.గనపురం గ్రామాల్లో, ఆళ్లగడ్డ నియోజకవర్గ ఇంఛార్జ్ రామలింగారెడ్డి ఆధ్వర్యంలో పేరయపల్లి గ్రామంలో గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం కొనసాగింది.


పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి 36వ వార్డులో ప్రతీ గడపలో పర్యటించారు. స్థానికంగా రూ.40 లక్షలతో నిర్మించిన కేసీ కాలువకు జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకట్ రెడ్డితో కలిసి భూమిపూజ చేశారు. పట్టాభి రామయ్యచౌదరి ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలోని కపిలేశ్వరం మండలం నల్లారు గ్రామంలో గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం కొనసాగింది. ఎన్నికల హామీలు విస్మరించి అవినీతి, అక్రమాలే ధ్యేయంగా పాలన సాగిస్తున్న చంద్రబాబు దుర్నీతిని వైయస్సార్సీపీ నేతలు ఇంటింటా ఎండగట్టారు. Back to Top