ధనార్జనే ధ్యేయంగా బాబు పాలన

బనగానపల్లె))దోమలపై దండయాత్ర కాకుండా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్రత్యేక హోదా సాధిస్తే రాష్ట్రం బాగుపడుతుందని వైయస్‌ఆర్‌ సీపీ బనగానపల్లె ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ప్రభుత్వానికి హితబోధ చేశారు. కోయిలకుంట మండలం వెలగటూరు గ్రామంలో రామిరెడ్డి గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ....ఎన్నికల్లో 600 హామీలిచ్చి మభ్యపెట్టి బాబు అధికారంలోకి వచ్చారని విమర్శించారు. ముఖ్యమంత్రి ప్రజాసమస్యలు పక్కనబెట్టి ధనార్జనే ధ్యేయంగా పాలన కొనసాగిస్తూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం గ్రామాలను అభివృద్ధి చేయకపోయినా ఎన్‌ఆర్‌ఐలు ముందుకొస్తుంటే గ్రామాల్లో టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాపారులు ప్రభుత్వంలో చేరి రాజకీయాలను వ్యాపారంగా మార్చారని దుయ్యబట్టారు. 


కృష్ణా జిల్లా(కైకలూరు))మండవల్లి మండలం నందిగామలంక గ్రామంలో దూలం నాగేశ్వరరావు గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎక్కడ చూసినా ఒకటే ఆవేదన. పథకాలు తమకు చేరడం లేదని...పింఛన్, రేషన్ ఏవీ సక్రమంగా అందడం లేదని ప్రజలు వైయస్సార్సీపీ నేతల వద్ద మొరపెట్టుకున్నారు. అమలు గానీ హామీలిచ్చి మోసం చేసిన చంద్రబాబు పాలనకు చరమగీతం పాడాలని నాగేశ్వరరావు ప్రజలకు పిలుపునిచ్చారు. 

Back to Top