బాబు పాలనంతా శూన్యమే

విశాఖపట్నం: చంద్రబాబు మూడేళ్ల పరిపాలనలో చేసిన అభివృద్ధి శూన్యమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ సమన్వయకర్త పేట్ల ఉమాశంకర్‌ గణేష్‌ విమర్శించారు. నాతవరం మండలం మన్యపురుట్ల గ్రామ పంచాయతీ పరిధిలో ఉమాశంకర్‌ గణేష్‌ ఆధ్వర్యంలో గడప గడపకూ వైయస్‌ఆర్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికీ తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చకుండా చంద్రబాబు అన్ని చేశానని గొప్పలు చెప్పుకుంటున్నాడని మండిపడ్డారు. స్థానిక ప్రజలకు ప్రజాబ్యాలెట్‌ను అందజేసి బాబు పరిపాలనపై మార్కులు వేయించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Back to Top