ప్రజాబ్యాలెట్ లో బాబుకు సున్నా మార్కులు

వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కొవ్వూరు మండలం కడవలూరు మండలంలో గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి బాబు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుపై అడిగి తెలుసుకున్నారు. కరపత్రాన్ని అందించి మార్కులు వేయమని కోరారు. మాయమాటలతో నమ్మించి ఓట్లు వేయించుకొని చంద్రబాబు తమను మోసం చేశాడని ప్రజలు టీడీపీపై దుమ్మెత్తిపోశారు. తమకు ఎప్పుడూ ఏ కష్టమొచ్చినా నేనున్నానంటూ  వచ్చి ఆదుకునే నాయకుడు వైయస్ జగన్ అని, ఆయన సీఎం ఐతేనే తమ కష్టాలు తీరుతాయని ప్రజలు ఘంటాపథంగా తేల్చిచెప్పారు. ప్రజాబ్యాలెట్ లో బాబుకు జీరో మార్కులు వేశారు.  


కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఇంఛార్జ్ జగన్మోహన్ రెడ్డి గోనెగండ్ల పట్టణంలో నిర్వహించిన గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోయజకవర్గంలో జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి గడపగడపలో పర్యటించారు. ప్రజల సమస్యలు తెలుసుకొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రభుత్వంపై పోరాడుదామని ప్రజలకు పిలుపునిచ్చారు. అవి నెరవేర్చని పక్షంలో రానున్నది మన ప్రభుత్వమని, వైయస్ జగన్ వచ్చిన వెంటనే మన కష్టాలన్నీ తీరిపోతాయని ధైర్యం కల్పించారు. 

Back to Top