విదేశీమోజులో చంద్రబాబు


క‌ర్నూలు జిల్లా(ఎమ్మిగ‌నూరు): బాబు పాల‌న‌లో ప్ర‌జ‌లు విల‌విల్లాడుతున్నార‌ని ఎమ్మ‌గ‌నూరు నియోజ‌క‌వ‌ర్గ ఇంఛార్జ్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అన్నారు. ప్ర‌జ‌లు ప్ర‌భుత్వ తీరుతో ఏమాత్రం సంతృప్తిగా లేరని, చంద్ర‌బాబు ప్ర‌భుత్వ బానిస‌త్వాన్నుంచి విముక్తి కోరుతున్నార‌ని చెప్పారు. చంద్ర‌బాబు ఎంతసేపు సింగపూర్, చైనా, జ‌పాన్ అంటూ విదేశాలు తిరుగుతూ ప్ర‌జ‌లను గాలికొదిలేశారని ఫైర్ అయ్యారు. రానున్నది మన ప్రభుత్వమని, వైయస్ జగన్ సీఎం అయిన వెంటనే కష్టాలన్నీ తీరిపోతాయని  ప్ర‌జ‌ల‌కు భరోసా కల్పించారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా గోనెగండ్ల టౌన్ కురువ గేరి, వ‌డ్డే వీధిలో ఆయ‌న ప‌ర్య‌టించారు. కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్ సీపీ నాయ‌కులు కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

Back to Top