చంద్రబాబు రాష్ట్రానికి చీడపురుగులా దాపురించారు

సామాన్యుల గోడు పట్టడం లేదు
శ్రీకాకుళం జిల్లా (నరసన్నపేట))  చంద్రబాబు అంత దగా పాలన దేశంలో మరెక్కడా లేదని నరసన్నపేట మాజీ ఎమ్మెల్యే, వైయస్సార్‌సీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ ధ్వజమెత్తారు. జలుమూరు మండలం తిమడాం గ్రామపంచాయతీ లో గడపగడపకు వైయస్సార్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ... చంద్రబాబు రాష్ట్రానికి చీడపురుగులా మారారని, టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ కార్యకర్తలకు తప్ప సామాన్య ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదని విమర్శించారు. 

వసతుల కల్పనలో వివక్ష
నెల్లూరు జిల్లా (సూళ్లురుపేట))ఎ్రరబాలెం చెరువులో పట్టాలిస్తే ఇళ్లు కట్టుకున్నామని, వసతులు కల్పించే విషయం మాత్రం విస్మరించారని పట్టణంలోని 23వ వార్డు పరిధిలో ఉన్న డ్రైవర్స్‌ కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు.  డ్రైవర్స్‌ కాలనీ నరసమ్మకట్ట ప్రాంతంలో గడపగడపకు వైయస్సార్‌ కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకు స్థానికులు సమస్యలు ఏకరువుపెట్టారు. వర్షాకాలంలో చెరువు నీళ్లు ఇళ్లలోకి వస్తున్నాయని, రోడ్లు, మురుగు కాలువలు, తాగునీటి కుళాయిలు లేక అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన కిలివేటి మున్సిపల్‌ కమిషనర్‌ పాయసం వెంకటేశ్వర్లును పిలిచి కాలనీలో నెలకొన్న సమస్యలపై ప్రశ్నించారు. వసతులు కల్పించడంలో వివక్ష ఎందుకుని నిలదీశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

టీడీపీని తరిమికొట్టండి
తూర్పుగోదావరి జిల్లా(మండపేట))కపిలేశ్వరం మండలం మాచర గ్రామ పరిధిలోని మాచర మట్టలు, శ్రీరాంపురంను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైయస్సార్‌సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి ఎదుట ప్రజలు వాపోయారు. పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాధాకృష్ణ(రాజుబాబు), పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పెంకె వెంకట్రావు తదితరులతో కలిసి గ్రామంలో పట్టాబి పర్యటించారు.రుణాలు మాఫీ కాలేదని రైతులు, మహిళలు పట్టాబి వద్ద మొరపెట్టుకున్నారు. పింఛన్లు, రేషన్ రావడం లేదని వాపోయారు. వ్యక్తిగత మరుగుదొడ్ల కోసం టీడీపీ నేతలు రూ. 3 వేలు వసూలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  మోసాలతో పాలన సాగిస్తున్న టీడీపీని రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని పట్టాబి పిలుపునిచ్చారు.  
 
Back to Top