మోసం చేసిన ఘనత బాబుకే దక్కింది

కర్నూలు(మంత్రాలయం)) రాష్ట్రంలో రాక్షస పాలన సాగుంతోదని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి మండిపడ్డారు. మంత్రాలయం మండలం కల్లుదేవకుంట గ్రామంలో గడపగడపకూ వైయస్ఆర్ కాంగ్రెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని వృద్ధులు, మహిళలు సీసీరోడ్లు, తాగునీటి సమస్య గురించి ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా..వాటి పరిష్కారం కోసం కృషిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.... బాబు అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి రాష్ట్రంలో కరువు ఏర్పడిందని అన్నారు. వృద్ధులు, వికలాంగులకు పింఛన్లు చేతికి అందడం లేదని ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. అర్హులైన పేదల రేషన్ కార్డులను రద్దు చేయడం సిగ్గుచేటని టీడీపీపై ధ్వజమెత్తారు. రైతు, డ్రాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పి మోసం చేసిన ఘనత బాబుకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో బాబుకు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.


Back to Top