బాబు స‌ర్కార్‌కు రోజులు ద‌గ్గ‌ర‌ప‌డ్డాయ్‌

పి. గ‌న్న‌వ‌రంః చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి రోజులు ద‌గ్గ‌ర‌ప‌డ్డాయ‌ని, ప్ర‌జ‌లంతా బాబుపై ఆగ్రంలో ర‌గ‌లిపోతున్నార‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కో-ఆర్డినేట‌ర్ కొండేటి చిట్టిబాబు విమ‌ర్శించారు. పి. గ‌న్న‌వ‌రం మండ‌ల ప‌రిధిలోని పోత‌వ‌రం గ్రామంలో బుధ‌వారం గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఇంటింటికీ తిరుగుతూ చంద్ర‌బాబు మోసాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు. ఎన్నిక‌ల ముందు త‌ప్పుడు వాగ్దానాలు ఇచ్చి ప్ర‌జ‌ల‌ను మోసం చేశాడ‌న్నారు. మూడేళ్ల‌లో ఒక్క సంక్షేమ ప‌థ‌కం ప్ర‌వేశ‌పెట్ట‌ని బాబు స‌ర్కార్‌పై ప్ర‌జ‌లంతా మండిప‌డుతున్నార‌న్నారు. కార్య‌క్ర‌మంలో పార్టీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి మిండ‌గుదుటి మోహ‌న‌రావు, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు.

Back to Top