బాబు సర్కార్ ను బంగాళాఖాతంలో కలిపేద్దాం

ప్రకాశంః  రాష్ట్రంలో ప్ర‌జావ్య‌తిరేక ప‌రిపాల‌న సాగిస్తున్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు రాబోయే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో త‌గిన గుణ‌పాఠం చెప్పాల‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా క‌నిగిరి నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ బుర్రా మ‌ధుసూద‌న్‌యాద‌వ్ ప్ర‌జ‌ల‌కు సూచించారు. నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని  హెచ్ఎం పాడు మండ‌లం గాయంవారి ప‌ల్లిలో గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఇంటింటికి తిరుగుతూ చంద్ర‌బాబు మోస‌పూరిత హామీల‌పై ప్ర‌చురించిన ప్ర‌జాబ్యాలెట్‌ను పంచుతూ బాబు పాల‌న‌పై మార్కులు వేయించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ ...రాష్ట్రాన్ని గాలికివ‌దిలేసి ప్ర‌జాసొమ్ముతో చంద్ర‌బాబు గాలి తిరుగుడు తిరుగుతున్నాడ‌ని విమ‌ర్శించారు. 2019 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు పార్టీని బంగాళ‌ఖాతంలో క‌ల‌పాల‌న్నారు. 


Back to Top