చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గాన్ని మ‌ర‌చిపోయారు...

కుప్పం: చంద్ర‌బాబు ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌ప్ప, మిగిలిన సమయాల్లో తమ నియోజ‌క‌వ‌ర్గానికి వ‌చ్చి   గోడు తెలుసుకున్న దాఖలాలే లేవ‌ని కుప్పం నియోజ‌క వర్గ ప్ర‌జ‌లు వాపోయారు.

"చంద్ర‌బాబు మా నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెల‌వ‌డం, ఆయ‌నే మా నాయ‌కుడు కావ‌డం మా దుర‌దృష్ట‌ం" అని  ప్ర‌జ‌లు వాపోయారు.

గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వైయ‌స్ఆర్ సీపీ కార్య‌క్ర‌మంలో భాగంగా కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలంలోని యామగానిపల్లిలో కుప్పం నియోజకవర్గ పరిశీలకులు మండీసుధ, కుప్పం నియోజకవర్గ ఇంచార్జ్ చంద్ర‌మౌళి ప‌ర్య‌టించారు.


గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వెళ్లి ప్ర‌జ‌ల‌గోడు తెలుసుకున్నారు. చంద్ర‌బాబు నియోజ‌క‌వ‌ర్గం అని గొప్ప‌గా చెప్పుకోవ‌డ‌మే త‌ప్ప ఉండ‌టానికి స‌రైన గుడిసెలు కూడా లేవ‌ని ప్ర‌జ‌లు త‌మ గోడును వైయ‌స్ఆర్ సీపీ నాయ‌కులకు తెలిపారు. కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్ సీపీ నాయ‌కులు, కార్య‌కర్త‌లు పాల్గొన్నారు.


Back to Top