బాబు ప్ర‌జ‌ల‌ను న‌ట్టేట ముంచారు

వైయ‌స్సార్‌సీపీ జ‌గ్గంపేట స‌మ‌న్వ‌య క‌ర్త ముత్యాల శ్రీ‌నివాస్‌
ఎన్నిక‌ల‌కు ముందు ఎన‌లేని హామీలిచ్చిన చంద్ర‌బాబు ఎన్నిక‌ల త‌రువాత ప్ర‌జ‌ల‌ను న‌ట్టేట ముంచార‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ జ‌గ్గంపే ట స‌మ‌న్వ‌య క‌ర్త ముత్యాల శ్రీ‌నివాస్ అన్నారు. బాబు హామీల అమ‌లుపై వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ చేప‌ట్టిన గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడుతూ... ప్ర‌జ‌లు చంద్ర‌బాబుపై తీవ్ర‌స్థాయిలో మండిప‌డుతున్నార‌న్నారు. వృదాప్య, వికలాంగుల ఫించన్లు, రుణమాఫీ, డ్వాక్రా రుణ‌మాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి అంటూ బాబు ప్ర‌జ‌ల‌ను మోసం చేశార‌ని ఆయ‌న నిప్పులు చెరిగారు. ప్ర‌జ‌ల నుంచి వెలుగుచూసిన స‌మ‌స్య‌ల‌ను వెంట‌నే సంబంధిత అధికారులు ప‌రిష్కారించాల‌ని డిమాండ్ చేశారు. ఈ మేర‌కు స్థానిక ఎమ్మార్వో కార్యాల‌యం ఎదుట ధ‌ర్నా చేప‌ట్టారు. అనంత‌రం స‌మ‌స్య‌లతో కూడిన విన‌తిప‌త్రాన్ని అధికారుల‌కు అందించారు. ఈ కార్య‌క్ర‌మంలో వైయ‌స్సార్‌సీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, రైతులు, ప్ర‌జ‌లు త‌దిత‌రులు పాల్గొన్నారు. 
Back to Top