హామీలతో ముంచేశాడు!

 శ్రీకాకుళం జిల్లా)))  ఎన్నికల ముందు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీలను నమ్మి తామంతా మోసపోయామని జనం
ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం చేపట్టాక ఇచ్చిన హమీల్లో ఒక్కటీ అమలు కాలేదని
మండిపడ్డారు. గడపగడపకూ వైఎస్‌ఆర్ కార్యక్రమంలో భాగంగా పర్యటిస్తున్న వైఎస్‌ఆర్‌సీపీ
నాయకులకు ప్రజలు తమ సమస్యలను వివరిస్తున్నారు. జిల్లాలోని గ్రామాల్లో
కార్యక్రమానికి విశేష స్పందన వ‌స్తోంది.  

 శ్రీకాకుళం రూరల్ మండలంలోని
కుందువానిపేటలో వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ధర్మాన ప్రసాదరావు
ఆధ్వర్యంలో గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమం జరిగింది. స్మార్ట్ విలేజ్ అని చెప్పి
తమ భూములన్నీ ప్రభుత్వం లాక్కుంది. ఎటువంటి పరిహారం ఇవ్వలేదు, తర్వాత బతుకు తెరువు కోసం వలస వెళ్లిన వారికి
రేషన్ కట్ చేస్తున్నారని చీకటి దానయ్య, బర్రి లక్ష్మణ తదితరులు ధర్మాన ఎదుట ఆవేదన
వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు మాయ మాటలు నమ్మి మోసపోయారని, స్మార్ట్ విలేజ్ చేస్తామని హామీ ఇచ్చారని, ఇది హామీగానే మిగిలిపోయిందన్నారు.
కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి, డీసీఎంఎస్ అధ్యక్షుడు గొండు కృష్ణమూర్తి, పీఏసీఎస్ అధ్యక్షుడు గొండు కృష్ణమూర్తి
పాల్గొన్నారు. ఆమదాలవలస,
 రణస్థలం మండలం, రాజాం నగర పంచాయతీ, నరసన్నపేట మండలం, నందిగాం మండలం, కొత్తూరు మండలం, ఇఛ్చాపురం నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ కార్య‌క‌ర్త‌లు
నాయ‌కులు ఉత్సాహంగా గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వైయ‌స్ఆర్ సీపీ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తూ చంద్ర‌బాబు
ప్ర‌భుత్వ తీరును ఎండ‌గ‌డుతున్నారు.

 

Back to Top