బాబు ప్రజాద్రోహిగా మిగిలిపోతారు

కర్నూలు(నంద్యాల))ప్రతి విషయంలో ప్రజలను మోసగిస్తున్న సీఎం చంద్రబాబు చరిత్రలో ప్రజాద్రోహిగా మిగిలిపోతారని వైయస్‌ఆర్‌సీపీ నంద్యాల నియోజకవర్గ ఇంచార్జ్ మలికిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. గడప గడపకు వైయస్సార్ కార్యక్రమంలో భాగంగా నూనెపల్లె ప్రాంతంలోని బెన్నికాంప్లెక్స్, జాతీయ రహదారి, ఎస్‌ఆర్‌ నగర్‌లో పర్యటించి ప్రజా బ్యాలెట్‌ను పంపిణీ చేశారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేయకపోవడంతో  రైతులు వడ్డీలు చెల్లించుకోవాల్సి వస్తోందన్నారు. తిరిగి బ్యాంకుల్లో రుణాలు అందక అప్పులు చేసుకుంటూ అవి తీర్చే మార్గం లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని రాజగోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 

కాకినాడ సిటీ)))కాకినాడ జగన్నాథపురం మెయిన్‌ రోడ్డు ప్రాంతంలో నెలకొన్న ట్రాఫిక్‌ సమస్య వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. గడప గడపకకు వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా పార్టీ కాకినాడ సిటీ కో ఆర్డినేటర్‌ ముత్తా శశిధర్‌ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు గురువారం 16,23 డివిజన్‌లలో పర్యటించారు. విష్ణాలయం వీధి, జగనానథపురం మెయిన్‌రోడ్డు ప్రాంతాల్లోని వ్యాపారుస్థులు, స్థానికులను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ముత్తా శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ... నగరంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా ఏదో ఒక సమస్య ఎదురవుతోందని, దీనికంతటికీ కారణం ప్రజా సమస్యలపై సీఎం నిర్లక్ష్య వైఖరేనని స్పష్టం చేశారు. 

Back to Top