బాబు లాంటి అవినీతిపరుడు ప్రపంచంలోనే లేడు

కమలాపురంః

బాబు అధికారంలోకి వచ్చి మూడేళ్లయ్యినా ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. ప్రపంచంలోనే ఇలాంటి అవినీతిపరుడిని, అబద్ధాలు చెప్పే వ్యక్తిని బాబునే చూస్తున్నామన్నారు. గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ తిరిగి ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేశారు.  ప్రజలను దారుణంగా వంచించి చంద్రబాబు లక్షల కోట్లు దిగమింగుతున్నాడని రవీంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నది లేనట్టు, లేనది ఉన్నట్టుగా మాయ చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నాడని మండిపడ్డారు. రైతులకు వడ్డీలో పావు కూడా రుణాలు మాఫీ చేసిన పాపాన పోలేదన్నారు. బాబు రుణాలు మాఫీ చేయని కారణంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి ఉందన్నారు. వైయస్ఆర్ హయాంలోనే 90 శాతం ప్రాజెక్ట్ పనులు పూర్తయ్యాయని చెప్పారు. మిగిలిన కొద్దిపాటి పనుల కోసం అంచనాలను వేలకోట్లకు పెంచేసి దోచుకుంటున్నాడని బాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, టీడీపీ నేతలకు ప్రజలు త్వరలోనే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.


Back to Top