రాష్ట్రంలో అరాచక పాలన

గుంటూరుః రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని వైయస్సార్సీపీ నేత అన్నాబత్తుని శివకుమార్ మండిపడ్డారు. తెనాలిలో గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ఇంటింటా ఎండగట్టారు. వైయస్సార్సీపీకి అనుకూలంగా ఉన్నారని చెప్పి అర్హులైన వారికి పింఛన్లు ఇవ్వడం లేదని, కావాలని డీలర్ షిప్ ను రద్దు చేస్తున్నారని ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. సంక్షేమ కార్యక్రమాలను ప్రజలందరికి అందజేయాల్సిన ప్రభుత్వం..కేవలం టీడీపీ వాళ్లకే ఇవ్వడం దారుణమన్నారు. కుల,మత, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ అభివృద్ధి ఫలాలు అందించిన ఘనత వైయస్ఆర్ దని కొనియాడారు. సొంత పార్టీ వాళ్లకు మాత్రమే సంక్షేమ పథకాలు అందించే ప్రభుత్వం దేశంలో టీడీపీ తప్ప మరొకటి కాదని ఎద్దేవా చేశారు.

Back to Top