బాబు ప్రజావ్యతిరేక విధానాలు

ప్ర‌తి గ‌డ‌ప‌లో స‌మ‌స్య‌ల నివేద‌న‌
విశాఖ‌ప‌ట్నం(గాజువాక‌):  ప్ర‌తి ఇంటా ఏదో వేద‌న‌, హామీలు న‌మ్మి మోస‌పోయామ‌నే ఆవేద‌న‌. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అనుస‌రిస్తున్న ప్ర‌జా వ్య‌తిరేక విధానాల వ‌ల్ల అవ‌స్థ‌లు ప‌డుతున్న ప్ర‌జ‌లంతా త‌మ ఆవేద‌న‌ను వైయ‌స్సార్‌సీపీ నాయ‌కుల వ‌ద్ద వెలిబుచ్చుతున్నారు. గాజువాక స‌మ‌న్వ‌య‌క‌ర్త తిప్ప‌ల నాగిరెడ్డి ఆధ్వ‌ర్యంలో గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మం కొన‌సాగింది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న చంద్ర‌బాబు మోస‌పూరిత హామీల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు. అనంత‌రం వంద ప్ర‌శ్నల‌తో కూడిన ప్ర‌జాబ్యాలెట్‌ను అంద‌జేసి బాబు పాల‌న‌పై మార్కులు వేయించారు. 

ఇబ్బందులు క‌నిపించవా
ర‌ణ‌స్థ‌లం:  టీడీపీ ప్ర‌భుత్వ పాల‌న‌లో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌ని వైయ‌స్సార్‌సీపీ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త గొర్లె కిర‌ణ్‌కుమార్ ఆరోపించారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న స్థానికంగా పర్య‌టించారు. ప్ర‌జ‌ల‌తో మాట్లాడి వారి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకున్నారు. గ్రామంలో అర్హులున్నా పింఛ‌న్లు మంజూరు కావ‌డం లేద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. ప్ర‌తి నెల ఇంట్లో ఒక‌రి పేరును తొల‌గించి బియ్యం క‌ట్ చేస్తున్నార‌ని విమ‌ర్శించారు
Back to Top