ఎక్కడి సమస్యలు అక్కడే రాజ్యమేలుతున్నాయి

బ‌ల‌హీన వ‌ర్గాల అభ్యున్న‌తి వైయ‌స్సార్‌సీపీతోనే సాధ్యం
కురుపాం: బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల అభ్యున్న‌తి వైయ‌స్సార్‌సీపీతోనే సాధ్య‌మ‌ని ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి అన్నారు.  ఎన్నిక‌ల హామీల‌ను విస్మ‌రించిన టీడీపీ ప్ర‌భుత్వానికి బుద్ధి చెప్పాల‌ని  పుష్ప‌శ్రీ‌వాణి ప్రజలకు పిలుపునిచ్చారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆమె ఉరిడి పంచాయ‌తీ ప‌రిధిలోని ప‌ల్లంబారిడి, శాంతిన‌గ‌ర్‌, బొడ్డ‌మానుగూడ‌, కొండ‌బారిడి, రాయిమానుగూడ‌, తుమ్మిక‌మానుగూడ‌, గుంజ‌రాడ గ్రామాల్లో పర్య‌టించారు. టీడీపీ స‌ర్కార్ ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌ను అధికారంలోకి వ‌చ్చాక ఏ ఒక్క‌టి కూడా అమ‌లు చేయ‌డం లేద‌ని ధ్వ‌జ‌మెత్తారు. 

గ్రామ‌గ్రామ‌న స‌మ‌స్య‌లు 
సీతంపేట‌: త‌మ గ్రామాల్లో ఎక్క‌డిక‌క్క‌డే స‌మ‌స్య‌లు రాజ్య‌మేలుతున్నాయ‌ని వీటిని ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ప‌లు గ్రామాల గిరిజ‌నులు ఎమ్మెల్యే విశ్వాస‌రాయి క‌ళావ‌తి వ‌ద్ద ఆవేద‌న వ్య‌క్తం చేశారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా రేగుల‌గూడ‌, గూడ‌గుడ్డి, మ‌ర్రిపాడు, మూల‌గూడ‌, పెద్ద‌బ‌గ్గ‌, తోట‌గూడ గ్రామాల్లో ఆమె ప‌ర్య‌టించి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం వంద ప్ర‌శ్నల‌తో కూడిన ప్ర‌జాబ్యాలెట్‌ను ప్ర‌జ‌ల‌కు అంద‌జేసి చంద్ర‌బాబు మోస‌పూరిత హామీల‌పై మార్కులు వేయించారు. 

ఇంకుడు గుంతల బిల్లులు ఇచ్చేదెప్పుడు?
టెక్క‌లి(శివ‌రాంపురం): ఇంకుడు గుంత‌ల బిల్లులు ఎప్పుడు చెల్లిస్తార‌ని ప‌లువురు ల‌బ్ధిదారులు ప్ర‌భుత్వాన్నిప్ర‌శ్నించారు. నందిగాం మండ‌లం శివ‌రాంపురం గ్రామంలో వైయ‌స్సార్‌సీపీ నియోజ‌వ‌క‌ర్గ అద‌న‌పు స‌మ‌న్వ‌య‌క‌ర్త పేరాడ తిల‌క్ ఆధ్వ‌ర్యంలో గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... చంద్ర‌బాబు హామీల‌న్నినీటి ముట‌లుగానే మిలిగిపోయాయ‌ని ఆరోపించారు. రెండున్న‌రేళ్ల కాలంలో టీడీపీ స‌ర్కార్ ప్ర‌జ‌ల‌కు చేసింది ఏమీ లేద‌న్నారు. 

Back to Top