అచ్చెన్నాయుడు అవినీతి, అక్రమాలు

శ్రీకాకుళం))వైయస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ శ్రీనివాస్ నగర్ లో గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన రహదారి, తాగునీటి సదుపాయం లేదంటూ స్థానికులు తిలక్ దృష్టికి తీసుకొచ్చారు.  మంత్రి అచ్చెన్నాయుడు తన అనుచరులకు కీలక పదవులు కట్టబెట్టి అవినీతి, అక్రమాలను ప్రోత్సహిస్తున్నారని తిలక్ మండిపడ్డారు. టెక్కలి నియోజకవర్గం జరుగుతున్న ప్రతీ అవినీతి కార్యక్రమం వెనుక అచ్చెన్నాయుడు సోదరుడికి వాటా ఉందని తిలక్ విమర్శించారు. రెండేళ్లు ఓపిక పడితే వైయస్ జగన్ నాయకత్వంలో మన సమస్యలన్నీ తీరిపోతాయని ప్రజలకు భరోసా ఇచ్చారు.


Back to Top