"వైయస్ఆర్ కుటుంబం"లోకి 550 కుటుంబాలు

–మూడు బూత్‌ల్లో నూరుశాతం పూర్తి
కోసూరువారిపాలెం(మోపిదేవి): వైయస్సార్‌ కుటుంబంలోకి 550 కుటుంబాల వారు చేయడంతో మండలంలో ఇంటింటా నవరత్నాలు కార్యక్రమం శరవేగంగా దూసుకుపోతుంది. వైయస్‌ జగన్‌ మోహన రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాలు ఇంటింటా తీసుకెళ్లే కార్యక్రమం శరవేగంగా సాగుతుందని మండల పార్టీ కన్వీనర్‌ దుట్టా మోహన శివరాజయ్య తెలిపారు. గురువారం ఆయన పార్టీ కార్యాలయంలో బూత్‌ కమిటీలు పూర్తిచేసిన సభ్యత్వ పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలోని కోసూరువారిపాలెంలోని రెండు బూత్‌ కమిటీలు 113, 114లు, అన్నవరంలోని ఒక బూత్‌ కమిటీ 106 లో నూరుశాతం సబ్సిడీలు పూర్తిచేసి ఆదర్శంగా నిలిచారని అభినందించారు. మండలంలోని మిగిలిన బూత్‌ కమిటీల్లో కూడా నవరత్నాలు కార్యక్రమం త్వరిత గతిన పూర్తిచేయాలని కోరారు. గ్రామాల్లో మంచి స్పందన వస్తుందని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ పూర్తిగా నెరవేర్చలేదని పేదలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. జగనన్న రాకకోసం, మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్నామని చెబుతున్నారని తెలిపారు. బూత్‌ కమిటీ సభ్యులు కోసూరు సాంబశివరావు, కోసూరు నాగమల్లేశ్వరావు, సీహెచ్‌వి సత్యనారాయణ, గ్రామ కన్వీనర్లు గరికిపాటి రేణుకయ్య, పిండి వెంకటేశ్వరావు, జిల్లా ఎస్సీసెల్‌ ప్రధాన కార్యదర్శి లింగం జగదీష్‌కుమార్, మండల రైతు విభాగం కన్వీనర్‌ కోసూరు కోటేశ్వరావు, మండల ట్రేడ్‌ విభాగం కన్వీనర్‌ దిడ్ల జానకీరాంబాబు, మండల ఎస్సీ కన్వీనర్‌ చింతా లంకేశ్వరావు, తుమ్మా నాగేంద్రం, గరికిపాటి నాగరాజు, ఆరే ప్రకాశ్‌ పాల్గొన్నారు.

వైయస్సార్‌ సంక్షేమపాలన జగన్‌తోనే సాధ్యం
సత్తెనపల్లి: వైయస్సార్‌ సంక్షేమ పాలన జగన్‌తోనే సాధ్యమని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు షేక్‌ నాగూర్‌ మీరాన్‌ పేర్కొన్నారు. పట్టణంలోని 20వ వార్డులో కౌన్సిలర్‌ కూకుట్ల లక్ష్మీ నేతృత్వంలో గురువారం చేపట్టిన ఇంటింటికి వైయస్సార్‌ కుటుంబంను ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమాన్ని టీడీపీ ప్రభుత్వం విస్మరించిందన్నారు. జన్మభూమి కమిటీలతో అర్హులకు సంక్షేమ పథకాల ఫలాలు అందడం లేదన్నారు. వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వై.యస్‌. జగన్‌ మోహన్‌రెడ్డి పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్లీనరీలో నవరత్నాల పథకాలను ప్రకటించారన్నారు. రాబోయే ఎన్నికల్లో వైయస్సార్‌ సీపీని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్ళి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సభ్యత్వ నమోదు చేపట్టారు. కార్యక్రమంలో వైయస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి కళ్ళం వీరభాస్కరరెడ్డి, జిల్లా కార్యదర్శులు గార్లపాటి ప్రభాకర్, కొత్తా భాస్కర్, యువజన విభాగం జిల్లా కార్యదర్శి గుంటూరు సుషీంద్రకుమార్, పార్టీ నాయకులు కూకుట్ల శ్రీనివాసరావు, రామారావు, ధూళ్ళిపాళ్ల మెహర్, జలసూత్రపు నాగేశ్వరరావు, దోరెడ్ల రాంబాబు, దేవరశెట్టి రవికుమార్, వల్లెంకుట్ల రామకృష్ణ, అనుముల ఏడుకొండలు, పెద్దింటి కనకయ్య, కొప్పరావూరి సాంబశివరావు, బుడగాల సుబ్బారావు, బూత్‌ కమిటి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Back to Top