ఐదుకోట్ల మందిని మోసగించారు

ప్రజాసమస్యలే పట్టడం లేదు
నంద్యాల))సంక్షేమాన్నివిస్మరించి పాలన సాగిస్తున్న  చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెప్పాలని నంద్యాల వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ మలికిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. సాయిబాబానగర్‌లోని 26వ వార్డులో గడపగడపకు వైయస్‌ఆర్‌ కార్యక్రమం నిర్వహించి ప్రజా బ్యాలెట్‌ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ...చంద్రబాబు ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రత్యేక హోదా సాధనకు కేంద్రంపై ఒత్తిడి పెంచాల్సింది పోయి ప్యాకేజీ కోసం పాకులాడుతున్నాడని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

ఆంధ్రులను దగా చేశారు
పాణ్యం))ప్రత్యేక హోదా సంజీవని కాదంటూ ప్యాకేజీ చాలంటూ రూ. 5 కోట్ల మంది ప్రజలను సీఎం చంద్రబాబు మరోసారి మోసగించారని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఆరోపించారు. 30వ వార్డు సాయినగర్‌లో పార్టీ లీగల్‌ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ్వకేట్‌ కార్నాటి పుల్లారెడ్డి అధ్యక్షతన గడపగడపకూ వైయస్‌ఆర్‌ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చరితరెడ్డి మాట్లాడుతూ... ప్రజలను మోసం చేయడం సీఎం చంద్రబాబుకు వెన్నతోపెట్టిన విద్య అని విమర్శించారు. సమైక్య ఉద్యమంలో పోరాటం చేయకుండా విభజనకు మద్దతు తెలిపి ఆంధ్రులను దగా చేశారని మండిపడ్డారు. అనంతరం కార్యకర్తలు, పార్టీ శ్రేణులతో కలిసి వీధుల్లో పర్యటించారు, స్థానికలు సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్బంగా రోడ్డు సమస్యను సాయినగర్‌ వాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. 

ప్రజల ఆదరణ కోల్పోయిన టీడీపీ
కర్నూలు))  టీడీపీ ప్రభుత్వం ప్రజల ఆదరణ కోల్పోయిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి అన్నారు. కర్నూలు నియోజకవర్గ సమన్వయ కర్త హఫీజ్‌ఖాన్‌ ఆధ్వర్యంలో 11వ వార్డులోని ఖడక్‌పు వీధిలో గడపగడకు వైయస్‌ఆర్‌ కార్యక్రమం నిర్వహించారు. స్థానికులకు ప్రజా బ్యాలెట్‌ పంపిణీ చేసి వంద హామీల్లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఎన్ని నెరవేర్చారో చెప్పాలని కోరారు. ఈ సందర్భంగా గౌరు వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ...ఓటుకు నోటు కేసుకు భయపడి చంద్రబాబు రాష్ట్రానికి అన్యాయం చేశారని ఆరోపించారు. రేషన్, ఆధార్‌ ఉన్నా పెన్షన్‌ ఇవ్వడం లేదని వికలాంగురాలు ఫర్జానా వాపోయింది. వితంతు, వృద్ధాప్య పెన్షన్‌ మంజూరు చేయడం లేదని షేక్‌ షాజహాన్, రామక్క.. నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ఖాన్‌కు చెప్పుకుని వాపోయారు. 





Back to Top