వైయస్‌ఆర్‌ కుటుంబంలోకి 45.36 లక్షల సభ్యులు

ప్రకాశం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ చేపట్టిన వైయస్‌ఆర్‌ కుటుంబం కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్నారు. కార్యక్రమం చేపట్టిన 16 రోజుల్లో 45.36 లక్షల మంది ప్రజలు వైయస్ఆర్ కుటుంబంలో భాగస్వాములయ్యారన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనపై విసుగు చెందారన్నారు. జ్వరాలు, మంచినీటి సమస్యలు ప్రజలను వేధిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి చేపట్టిన 108, 104 పథకాలు బాబు పాలనలో మూలనపడ్డాయన్నారు. ఫీజు రియంబర్స్‌మెంట్‌ పథకం అమలులో లేక విద్యార్థులు చదువు మానేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో గ్రామ పంచాయతీలను చంద్రబాబు నిర్వీర్యం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజా ఫోటోలు

Back to Top