200 మంది టీడీపీ నేత‌లు వైయ‌స్ఆర్ సీపీలో చేరిక‌

తూర్పుగోదావ‌రి జిల్లాః ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పాల‌న‌ను సొంత పార్టీ నేత‌లే ఈస‌డించుకుంటున్నార‌ని, టీడీపీలో ఇమ‌డ‌లేక ఆ పార్టీ నేత‌లు పెద్ద ఎత్తున వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు క్యూలు క‌డుతున్నార‌ని వైయ‌స్ఆర్ సీపీ పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గ కో-ఆర్డినేట‌ర్ పెండెం దొర‌బాబు అన్నారు. కొత్త‌ప‌ల్లి మండ‌లం కొండెవ‌రం గ్రామంలో దొర‌బాబు ఆధ్వ‌ర్యంలో గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఇంటింటికీ తిరుగుతూ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకొని వాటి ప‌రిష్కారం కోసం కృషి చేస్తామ‌ని హామీ ఇచ్చారు. అనంత‌రం పెండెం దొర‌బాబు ఆధ్వ‌ర్యంలో టీడీపీకి చెందిన 200 మంది కార్య‌క‌ర్త‌లు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సంద‌ర్భంగా వారికి కండువాలు క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ... ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికై చేస్తున్న పోరాటాల‌కు ఆక‌ర్షితులై పార్టీలో చేరుతున్నామ‌న్నారు. రానున్న ఎన్నిక‌ల్లో వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని ముఖ్య‌మంత్రిని చేసుకుంటామ‌న్నారు. కార్య‌క్ర‌మంలో పార్టీ నేత‌లు మాజీ మంత్రి మోహ‌న్‌రావు, మాదిరెడ్డి దొర‌బాబు, ఆనాల సుద‌ర్శ‌న్‌, మోరాల‌శెట్టి బుజ్జి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Back to Top