జెడ్పీ మాజీ చైర్మన్‌ వైయస్‌ఆర్‌సీపీలో చేరిక


తూర్పు గోదావరి: వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్రకు ఆకర్శితులై పలువురు వైయస్‌ఆర్‌సీపీలో చేరుతున్నారు. ఈ క్రమంలో గురువారం తూర్పు గోదావరి జిల్లా జెడ్పీ చైర్మన్, పలువురు నేతలు వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. తూర్పు గోదావరి జిల్లాలో వైయస్‌ జగన్‌ బస చేస్తున్న ప్రాంతం వద్ద  వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో మాజీ జెడ్పీ చైర్మన్‌ దున్నా జనార్ధన్, డీసీసీబీ డైరెక్టర్‌ గోదాసి నాగేశ్వరరావు, ఐ.పోలవరం మండలం కాపు నేత సలాది శేషారావు తదితరులు వైయస్‌ఆర్‌సీపీలో చేరారు.  వారికి వైయస్‌ జగన్‌ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రాజన్న రాజ్యం తెచ్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని వైయస్‌ జగన్‌ పిలుపునిచ్చారు.
 
Back to Top