బాబుకు సున్నా మార్కులు

విజయవంతంగా గడపగడపకూ వైయస్సార్సీపీ
ఇడుపులపాయలో ఇంటింటికీ వైయస్ జగన్
బొట్టు పెట్టి హారతి పట్టి నీరాజనం పట్టిన ప్రజలు
 ఐదు గంటల పాటు పర్యటన
బాబు మోసాలను ఎండగట్టిన జననేత

 వైయస్సార్ కడప : టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని  ఎండగడుతూ వైయస్సార్సీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘గడపగడపకూ  వైయస్సార్సీపీ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోంది.  దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకొని  ప్రతిపక్ష నేత వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని ఇడుపులపాయలో లాంఛనంగా ప్రారంభించారు.  వైయస్సార్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం... ఇడుపులపాయ గ్రామానికి వెళ్లి ఎంపీ అవినాష్‌రెడ్డితో కలిసి పార్టీ జెండాను ఎగురవేసి గడపగడపకూ శ్రీకారం చుట్టారు. 

బొట్టు పెట్టి.. హారతి పట్టి
ప్రతిపక్షనేత హోదాలో తొలిసారిగా ఇడుపులపాయ  గ్రామంలో అడుగు పెడుతున్న సందర్భంగా వైయస్ జగన్‌ కు మహిళలు ప్రత్యేకత చాటుకున్నారు.  ప్రతి ఇంటి వద్ద మహిళలు ఇంట్లో నుంచి కుంకుమతోపాటు హారతి తీసుకొచ్చి దిష్టి తీస్తూ కార్యక్రమాన్ని స్వాగతించారు. వేంపల్లె ఎంపీపీ రవికుమార్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు షబ్బీర్, మండల కన్వీనర్ చంద్ర ఓబుళరెడ్డి, ఇడుపులపాయ సర్పంచ్ కృష్ణకుమారి, వైయస్సార్సీపీ నాయకులు చలపతి, విజయ్‌కుమార్ వెంట రాగా వైయస్ జగన్ అందరితో మాట్లాడుతూ గడపగడప తిరిగారు. చంద్రబాబు మోసాలను ఎండగట్టారు. రామాలయంలో ప్రత్యేక  పూజలు 
గడప గడపకూ వైయస్సార్సీపీ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని రామాలయంలో వైయస్ జగన్ ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా అర్చకులు జననేతను ఆశీర్వదించారు. 


ఐదు గంటల పాటు పర్యటన
వైయస్ జగన్ ఇడుపులపాయలో ఇంటింటికి తిరిగారు. ఒకటి, రెండు ఇళ్లు కాదు.. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు చేస్తున్న మోసాలను వివరించారు. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులతో ప్రజా బ్యాలెట్‌లో ఉన్న వంద ప్రశ్నలను సంధిస్తూ సమాధానాలు రాబట్టారు.  చంద్రబాబుకు ఒక్కటంటే ఒక్క మార్కు కూడా ప్రజలు వేయలేదు. శుక్రవారం ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 2.30గంటల వరకు ఇంటింటికి తిరుగుతూ గడప గడపకు వైయస్సార్సీపీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. గ్రామంలో కలియ తిరుగుతూ ఇంటింటి వద్ద తాను చెప్పేదే కాకుండా.. కుటుంబ సభ్యులు చెప్పే సమస్యలు ఆలకిస్తూ వైయస్ జగన్ పర్యటన సాగించారు. 

వైయస్ జగన్‌ను కలిసిన  నేతలు
వైయస్సార్సీపీ సీజీసీ సభ్యులు వైయస్ వివేకానందరెడ్డి, కడప ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, జెడ్పీ చైర్మన్ గూడూరు రవి, కడప, రాయచోటి ఎమ్మెల్యేలు అంజాద్ బాషా, శ్రీకాంత్‌రెడ్డి, రైతువిభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి వీరప్రతాప్‌రెడ్డి, వేముల మండల నాయకులు సాంబశివారెడ్డి, వేల్పుల రాము, చక్రాయపేట జెడ్పీటీసీ సభ్యుడు బెల్లం ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, తొండూరు మండల నాయకులు రవీంద్రనాథరెడ్డి, రామమునిరెడ్డి, భాస్కర్‌రెడ్డి, సింహాద్రిపురం పరమేశ్వరరెడ్డి, పులివెందుల మండల కన్వీనర్ కొమ్మా శివప్రసాద్‌రెడ్డి, ప్రొద్దుటూరు నాయకులు కొమ్మా శివచంద్రారెడ్డిలతోపాటు పలువురు నేతలు వైయస్ జగన్ ను కలిసి పలు అంశాలపై చర్చించారు. Back to Top