రెండో రోజు వైవీ సుబ్బారెడ్డి పాద‌యాత్ర‌ ప్రారంభం

 
ప్రకాశం :  ప్రకాశం జిల్లా ప్రాణధారమైన వెలిగొండ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చేపట్టిన పాద్రయాత్ర గురువారం రెండో రోజు ప్రారంభమైంది. ఈ నెల 15వ తేదీ కనిగిరి నుంచి ప్రారంభ‌మైన పాద‌యాత్రను వైయ‌స్ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు. హెచ్ఎం పాడు గ్రామంలో ప‌లువురు రైతులు వైవీ సుబ్బారెడ్డిని క‌లిసి త‌మ బాధ‌లు చెప్పుకున్నారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో, 15 రోజుల పాటు సుమారు 200 కిలో మీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. వెలిగొండ ప్రాజెక్టు వద్ద చివరి రోజున పాదయాత్ర ముగియనుంది. 

Back to Top