బాబు ఎవరితోనైనా కాపురం చేయగలడు


అవకాశవాద రాజకీయాలకు చంద్రబాబు పెట్టింది పేరు
శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు జలకళ అనడం సిగ్గుచేటు
ప్రకాశం జిల్లా ప్రజల నీటి కష్టాలు కనిపించడం లేదా?
దేవినేని ఉమా చంద్రబాబుకు బినామీ

ప్రకాశం: అవకాశవాద రాజకీయాలకు పెట్టింది పేరు చంద్రబాబు అని, ఎవరితోనైనా కాపురం చేయగలడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలని డిమాండ్‌ చేస్తూ వైవీ సుబ్బారెడ్డి ప్రకాశం జిల్లాలో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు జలకళ అని చంద్రబాబు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. జిల్లాలో ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతుంటే.. జలకళ అంటూ చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నాడని మండిపడ్డారు. ప్రకాశం జిల్లా ప్రజల కష్టాలు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. పశ్చిమ ప్రకాశంలో కరువు కమ్మేసిందన్నారు. ఫ్లోరిన్‌ బారినపడి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయకుండా కాకమ్మ కథలు చెప్పుకుంటూ తిరుగుతున్నాడన్నారు. ప్రాజెక్టులో పాత కాంట్రాక్టర్లను తొలగించి తన బినామీలను పెట్టుకున్నాడని, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా చంద్రబాబు బినామీ అన్నారు. 

2014 ఎన్నికల్లో అనుభవం ఉంది.. అభివృద్ధి చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు చేసిన అమరావతిలో చేసిన అభివృద్ధి నీటమునుగుతున్నాయన్నారు. వందల కోట్లు ఖర్చు చేసి చంద్రబాబు కట్టిన తాత్కాలిక భవనంలోని గదులు చిన్నపాటి వర్షానికే చెరువును తలపిస్తున్నాయన్నారు. సచివాలయంలో లీకేజీల పర్వం కొనసాగుతుందని ధ్వజమెత్తారు. ప్రజాధనాన్ని ఎప్పుడు ఎలా దోచుకోవాలనే ఆలోచన తప్పితే.. ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశమే టీడీపీ ప్రభుత్వానికి లేదన్నారు. కాంగ్రెస్‌తో టీడీపీ కలవడంలో ఆశ్చర్యం లేదన్నారు. చంద్రబాబు ఎవరితోనైనా కాపురం చేయగలడని, ఉదయం బీజేపీతో, సాయంత్రం కాంగ్రెస్‌తో చంద్రబాబు లాలూచీ రాజకీయాలు కొనసాగుతున్నాయన్నారు. అవకాశవాద రాజకీయాలకు చంద్రబాబు పెట్టింది పేరన్నారు. 
Back to Top