ముగిసిన వైవీ సుబ్బారెడ్డి పాదయాత్ర


ప్రకాశం: వెలుగొండ ప్రాజెక్టు సాధనకు ఈ నెల 15వ తేదీన వైయస్‌ఆర్‌సీపీ తాజా మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చేపట్టిన ప్రజా చైతన్య పాదయాత్ర పెద్ద దోర్నాల మండలంలోని వెలుగొండ టన్నెల్‌ వద్ద ముగిసింది. ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు అశేష జనం హాజరయ్యారు. 14 రోజుల పాటు 207 కిలోమీటర్లు వైవీ సుబ్బారెడ్డి పాదయాత్ర చేసి రైతుల కష్టాలు తెలుసుకున్నారు.  ముగింపు కార్యక్రమంలో తాజా మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మాజీ మంత్రులు పార్థసారధి, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు ఆదిమూలపు సురేష్, జంకే వెంకట్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుల పేరుతో చంద్రబాబు చేసిన దోపిడీపై రూపొందించిన పుస్తకాన్ని నేతలు ఆవిష్కరించారు. 
 
Back to Top