విద్యార్థుల ఆత్మహత్యలపై విచారణ జరపండి

న్యూఢిల్లీః వైయస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి న్యూఢిల్లీలో జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషనర్ ను కలిశారు. నారాయణ, శ్రీచైతన్య కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై ఫిర్యాదు చేశారు. ఎన్సీపీసీఆర్ జోక్యం చేసుకొని విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. కాలేజీల యజమానులే మంత్రులుగా ఉండడంతో అధికారులు చర్యలు తీసుకోవడం లేదని వివరించారు. స్వల్ప వ్యవధిలో 40 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

Back to Top