కిడ్నీ, ప్లోరోసిస్ నియంత్రణ సెంటర్ ను ఏర్పాటు చేయండి

న్యూఢిల్లీ: 

ప్రకాశం జిల్లాను డిఫెన్స్‌ హబ్‌గా అభివృద్ధి చేయాలని ప్రధాని నరేంద్రమోదీని వైయస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కోరారు. రక్షణ రంగానికి చెందిన వివిధ సంస్థల ఏర్పాటుకు జిల్లాలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని వివరించారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయంలో ఆయన వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా బాధిత గ్రామాల్లో కేంద్ర బృందం పర్యటన తర్వాత ఇచ్చిన హామీ మేరకు వెంటనే కిడ్నీ, ఫ్లోరోసిస్‌ నియంత్రణ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని కోరారు.  విశాఖకు రైల్వే జోన్, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 

Back to Top