బస్సు ప్రమాద బాధితులకు పరామర్శ

ప్రకాశంః బస్సు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఒంగోలులోని RIMS హాస్పటల్ లో ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, కనిగిరి నియోజకవర్గ ఇంఛార్జ్ బుర్రా మధుసూదన్, పార్టీ నాయకులు పరామర్శించారు.  వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.  అధికార పార్టీ  నాయకుల అండతో  నిబంధనకు విరుద్దంగా బస్సులను తిప్పుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని, అధికారులు ఇప్పటికైనా మేల్కొని చట్ట విరుద్ధంగా నడుస్తున్న బస్సులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Back to Top