అందరం కలిసి ఉప ఎన్నికలకు వెళ్దాం రండి


న్యూఢిల్లీ: ఏపీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అన్యాయాన్ని నిరసిస్తూ మేం ఎంపీ పదవులకు రాజీనామా చేసి ఆమోదించుకున్నామని, పార్టీ ఫిరాయించిన ఎంపీ, ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి ఉప ఎన్నికలకు వెళ్దామని వైవీ సుబ్బారెడ్డి చంద్రబాబుకు సవాల్‌ విసిరారు.  స్పీకర్‌తో భేటీ అనంతరం వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. వైయస్‌ఆర్‌సీపీకి చెందిన ఐదుగురు ఎంపీలం స్పీకర్‌ను కలిశామన్నారు. మా రాజీనామాలను ఆమోదించాలని మరోమారు కోరామన్నారు. అలాగే మా పార్టీ నుంచి టీడీపీలో చేరిన ఎంపీలపై అనర్హత వేటు వేయాలని కోరామన్నారు. మాతో పాటు వారిపై కూడా చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను విజ్ఞప్తి చేశామన్నారు. మా రాజీనామాల కథ సుఖాంతమైందన్నారు. రాజీనామాలను ఆమోదించుకుని ఎన్నిలకు వెళ్తున్నామని, చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే మా పార్టీ నుంచి చేర్చుకున్న వారిపై అనర్హత వేటు వేయాలని, అందరం కలిసి ఉప ఎన్నికలకు వెళ్తామని సవాల్‌ విసిరారు. టీడీపీ ఎంపీలు పార్లమెంట్లో డ్రామాలాడారన్నారు. వారి డ్రామాలు దేశవ్యాప్తంగా చూశారన్నారు. చిత్తశుద్ధితో వైయస్‌ జగన్‌ నాయకత్వంలో పోరాటం చేస్తున్నామన్నారు. బీజేపీ, టీడీపీలు ఏపీ ప్రజలకు వెన్నుపోటు పొడిచాయని, ప్రత్యేక హోదా సాధించే వరకు మా పోరాటం కొనసాగుతుందన్నారు. 
 
Back to Top