బ్రెజిల్ పర్యటనలో వైవి సుబ్బారెడ్డి

వైఎస్సార్సీపీ ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డి బ్రెజిల్ పర్యటనకు వెళ్లారు. యుబ్రెబ నగరంలో జరుగుతున్న 82వ అంతర్జాతీయ మేలు జాతి పశువుల ప్రదర్శనలో వైవి పాల్గొననున్నారు. మే 7 వరకు జరిగే ఈప్రదర్శన జరగనుంది. వైవి సుబ్బారెడ్డితో పాటు మరో ఏడుగురు పాడి రైతు సంఘాల, స్వచ్ఛంద సంస్థల  ప్రతినిధులున్నారు. ప్రపంచంలోనే అతి పెద్దదిగా భావించే ఈప్రదర్శనకు వైవి సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు అంకుష్ సంస్థ ప్రధాన కార్యదర్శి పి. సురేష్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. 


 ఒంగోలు జాతి పశుసంపద అభివృద్ధికి ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చేస్తున్న కృషి ఫలించిన సంగతి తెలిసిందే. పశుసంపద వృద్ధికి ఎంతోకాలంగా బ్రెజిల్ అనుసరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని భారతదేశానికి ఇచ్చేందుకు ఆ దేశం అంగీకరించింది. అందులో భాగంగా బ్రెజిల్‌లో ఏప్రిల్ 30వ తేదీ నుంచి మే 7వ తేదీ వరకు జరిగే ‘ఎపోజెబ్ ఎక్స్‌పో’కు హాజరవ్వాలంటూ ఎంపీ వైవీకి ఆహ్వానమందింది. ఆహ్వాన పత్రికను బ్రెజిల్ దేశ ప్రతినిధి డాక్టర్ జోస్ ఓటాలియా లెవ్రోస్ ... గతంలో హైదరాబాద్‌లో ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని ఆయన నివాసంలో కలసి అందజేశారు.

తాజా వీడియోలు

Back to Top