భోగి సంబరాల్లో వైవీ సుబ్బారెడ్డి

ఒంగోలు: ప్రకాశంజిల్లా కేంద్రమైన ఒంగోలులో జరిగిన సంక్రాంతి భోగి సంబరాల్లో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. స్థానిక సాయిబాబా గుడి వద్ద భోగి మంటల కార్యక్రమంలో  పాల్గొన్నారు. అనంతరం అక్కడ లయన్స్‌ క్లబ్‌, సేవ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన కోలాటాలను, పాటల కచేరిని ఆయన తిలకించారు. జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రైతులు పాడిపంటలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

Back to Top