ఐసీఎఆర్ శాస్త్ర పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోండి

ప్రకాశంః
ప్రపంచ నేలల దినోత్సవ కార్యక్రమం సందర్భంగా ప్రకాశం జిల్లాలో దర్శి కృషి
విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేసిన సదస్సుకు వైఎస్సార్సీపీ ఎంపీ వైవి
సుబ్బారెడ్డి హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఇలాంటి కార్యక్రమాలు
నిర్వహించడం మంచి పరిణామం అన్నారు. భూసార పరీక్షల వల్ల ఎలాంటి పంటలు
వేస్తే దిగుబడి వస్తుంది, లాభాలు ఏమేరకు ఆర్జించవచ్చనేది తెలుస్తుందని వైవి
సుబ్బారెడ్డి అన్నారు. ల్యాబ్ టూ ల్యాండ్... ల్యాబరేటరీ నుంచి వ్యవసాయ
ఉత్పత్తులు రైతులకు చేరినప్పుడే వ్యవసాయం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. 

శాస్త్ర
పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్
రీసెర్చ్ వారిని ఎంపీ అభినందించారు. ఇలాంటి పరిజ్ఞానం వల్ల పొలాల్లో
 రైతులు ఎరువులు ఎంత మోతాదులో వాడాలి, ఏవి వాడకూడదు అనేది
తెలుస్తుందన్నారు. ప్రకాశం జిల్లాలో పంటలు వేసి నష్టపోయి 36 మంది రైతులు
చనిపోయారని వైవి సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈపరిజ్ఞానాన్ని
అందిపుచ్చుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. ఎలాంటి పంటలు వేస్తే దిగుబడి
వస్తుందో తెలుసుకొని దానికనుగుణంగా సాయిల్ టెస్ట్ చేసుకొని
ముందుకెళ్లాలన్నారు. ఈ పరిజ్ఞానంపై రైతుల్లో అవేర్ నెస్ తీసుకురావాల్సిన
అవసరం ఎంతైనా ఉందన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top