హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వార్థం కోసం పరిపాలన తప్పుల తడకగా సాగుతోందన్న సంగతి స్పష్టం అవుతోంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల్నితుంగలోకి తొక్కి పరిపాలన సాగిస్తున్నారన్న విషయం మరోసారి బయట పడింది.<br/><strong>కేంద్ర ఉత్తర్వులు</strong>జాతీయ ఆరోగ్య మిషన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం పథకాన్ని అమలు చేస్తోంది. ఇందులో పారదర్శకత కోసం జిల్లా ల స్థాయిలో ఒక విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ని ఏర్పాటు చేసింది. దీనికి జిల్లా లోని లోక్ సభ సభ్యుల్ని ఛైర్మన్ లుగా నియమిస్తూ కేంద్రం ఈ ఏడాది మార్చి 30న ఉత్తర్వులు ఇచ్చింది. ఆయా జిల్లాలకు చెందిన ఎంపీలను పార్టీలకు అతీతంగా నియమించటం జరిగింది. <br/><strong>రాష్ట్ర ప్రభుత్వం దొంగాట</strong>కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల్ని తుంగలోకి తొక్కి రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించింది. తెలుగుదేశం నాయకుల్ని తెర మీదకు తెచ్చి, ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఎంపీలను పక్కకు తప్పించింది. టీడీపీ నాయకులకే ఛైర్మన్ పదవుల్ని అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు ఇచ్చారు. అప్రజాస్వామికంగా జరిగిన ఈ నిర్ణయాన్ని తప్పు పడుతూ వైఎస్సార్ సీపీ తరపున ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదుచేశారు దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్నిమందలిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి మనోజ్ ఝలానీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా వైఎస్సార్ కడప జిల్లాకు వైఎస్ అవినాష్ రెడ్డిని, ప్రకాశం జిల్లాకు వైవీ సుబ్బారెడ్డిని, నెల్లూరు జిల్లాకు మేకపాటి రాజమోహన్ రెడ్డిని నియమించటం జరిగింది.