ఈ నెల 10 నుంచి పాద‌యాత్ర‌

  
ఒంగోలు : ప్రకాశం జిల్లాపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నాయ‌కులు,  మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. చంద్ర‌బాబు మోసాల‌పై ఈ నెల 10వ తేదీ నుంచి పాద‌యాత్ర నిర్వ‌హిస్తున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.  బుధవారం వైవీ సుబ్బారెడ్డి విలేకరులతో మాట్లాడారు. వెలిగొండ ప్రాజెక్టుకి నిధులు ఇవ్వకుండా చంద్రబాబు నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. జిల్లాలోని అన్ని ప్రాజెక్టులు మూలనపడ్డాయని తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా మోసం చేశారని ధ్వజమెత్తారు. రామాయపట్నం పోర్టుకి శంకుస్థాపన చేస్తానని బాబు చెప్పడం మరో మోసానికి పాల్పడటమేనని వ్యాఖ్యానించారు. కేంద్రానికి ఇప్పటి వరకు ప్రతిపాదనలు పంపకుండా నాటకాలు ఆడుతున్నారని బాబుపై మండిపడ్డారు. పాద‌యాత్ర ద్వారా ప్రభుత్వ మోసాన్ని ప్రజలకు వివరిస్తానని తెలిపారు. తాను జిల్లాలో నాలుగు రైల్వే ఓవర్‌ బ్రిడ్జిలు మంజూరు చేయించినా నేటికీ పనులు ప్రారంభించలేదని విమర్శించారు.

 

Back to Top