నాలుగేళ్లు కేంద్రంతో కలిసి ఉండి ఏం సాధించారో?


 

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో టీడీపీ చేసిన డ్రామాలను దేశమంతా చూసిందని, నాలుగేళ్లు కేంద్రంతో కలిసి ఉండి ఏం సాధించారో చెప్పాలని ఏపీ సీఎం చంద్రబాబును ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు.  తమ రాజీనామాలు ఆమోదించాలని లోక్‌సభ స్పీకర్‌పై మరోసారి ఒత్తిడి తీసుకొస్తామని ఆయ‌న పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంజీవని లాంటి ప్రత్యేక హోదా సాధన కోసం ఐదుగురు వైయ‌స్ఆర్‌ సీపీ ఎంపీలు తమ రాజీనామాలు సమర్పించిన విషయం తెలిసిందే. ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలను అమలు చేయాల్సిందేనన్నారు. 
తన స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారంటూ మండిపడ్డారు. ప్రత్యేక హోదా కంటే పదవులు ముఖ్యం కాదని, హోదా వస్తేనే ఏపీ అభివృద్ధి సాధ్యమని తెలిపారు. చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. మొదటినుంచీ హోదా కోసం వైయ‌స్ఆర్‌సీపీ  పోరాడుతూనే ఉందని, ఇందుకోసం ఎంపీలందరం ఆమరణ దీక్ష చేశామని గుర్తుచేశారు. చంద్రబాబు దీక్షలతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.  ప్రజాస్వామ్యంపై ఏమాత్రం విశ్వాసం ఉన్నా.. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబును వైవీ సుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు. 

Back to Top