కేంద్రం చేసిన మోసం దేశవ్యాప్తంగా తెలియజేశాం


ఢిల్లీ: ఎన్డీయే ప్రభుత్వం ఆంధ్రరాష్ట్రానికి చేసిన మోసాన్ని దేశ మొత్తం తెలిసే విధంగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాటం చేసిందని పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా సాధించే వరకు వైయస్‌ఆర్‌ సీపీ పోరాటం ఆగదన్నారు. పార్లమెంట్‌ ఆవరణలో వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాజీనామాలతో ఉపయోగం లేదని చెప్పడానికి పవన్‌ కల్యాణ్‌కు ఏం తెలుసన్నారు. 2014లో పవన్‌ ముందే మోడీ 10 సంవత్సరాలు  హోదా ఇస్తామని చెప్పారని, అలాంటప్పుడు వారు ప్రశ్నించాలన్నారు. అవిశ్వాసం ప్రవేశపెడితే మద్దతు కూడగడతానని చెప్పిన పవన్‌ కల్యాణ్‌ ఎక్కడికి పోయారన్నారు. అవిశ్వాసంతో ఏం ఒరుగుతుందన్న చంద్రబాబుతోనే అవిశ్వాసం ప్రవేశపెట్టేలా చేసిన పార్టీ వైయస్‌ఆర్‌ సీపీ అన్నారు.  
 
Back to Top