మార్కాపురంలో కొనసాగుతున్న వైవీ పాదయాత్ర

ప్రకాశం: వెలిగొండ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చేపట్టిన పాదయాత్ర మూడవ రోజు మార్కాపురం నియోజకవర్గంలో కొనసాగుతోంది. కనిగిరి నుంచి పాదయాత్ర ప్రారంభించిన వైవీ సుబ్బారెడ్డి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకుసాగుతున్నారు. ఐదు నియోజకవర్గాల్లో సుమారు 15 రోజుల పాటు పాదయాత్ర సాగనుంది. వైవీ సుబ్బారెడ్డి వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు.
Back to Top