చంద్ర‌బాబు కొత్త డ్రామా

 న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్లీ కొత్త డ్రామాకు తెర లేపారని వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా పార్లమెంటులో శుక్రవారం వైయ‌స్‌ఆర్‌ సీపీ పార్టీ ప్రవేశపెట్టనున్న అవిశ్వాసానికి నిన్న(గురువారం) మద్దతు తెలిపిన చంద్రబాబు ఈ రోజు మాట మార్చారని ఆయన వ్యాఖ్యానించారు. నాలుగేళ్లు ఎన్డీయేలో కొనసాగుతూ చంద్రబాబు ఏం సాధించారని వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు తీరును ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు.
Back to Top