వాస్త‌వాలు చెప్ప‌డానికే ప్ర‌జా చైత‌న్య పాద‌యాత్ర‌- 14వ రోజు వైవీ సుబ్బారెడ్డి పాద‌యాత్ర ప్రారంభం
- హెడ్ రెగ్యులేట‌ర్ పూర్తి కాకుండానే వెలుగొండ ఎలా నిర్మిస్తారు
- సాయంత్రం భారీ బ‌హిరంగ స‌భ‌
ప్ర‌కాశం:  చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను వివ‌రించేందుకు ప్ర‌జా చైత‌న్య పాద‌యాత్ర చేప‌ట్టిన‌ట్లు వైయ‌స్ఆర్‌సీపీ తాజా, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. వెలిగొండ సాధన కోసం ఈ నెల 15వ తేదీన ప్రారంభ‌మైన ప్ర‌జా చైత‌న్య పాద‌యాత్ర మంగ‌ళ‌వారం దోర్నాల నుంచి 14 రోజు యాత్ర‌ను ప్రారంభించారు. అక్క‌డి నుంచి య‌డ‌వ‌ల్లి, గంట‌వానిప‌ల్లె మీదుగా కొత్తూరు వ‌ర‌కు పాద‌యాత్ర సాగుతోంది. ఈ సంద‌ర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ .. ప్ర‌కాశం జి ల్లాలో ప్ర‌జ‌లు ఫ్లోరైడ్ నీటిని తాగి రోగాల బారీన ప‌డుతున్నార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేవారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, ప్రజలకు కనీసం తాగు, సాగునీరు ఇవ్వలేని పరిస్థితుల్లో టీడీపీ ప్రభుత్వం ఉందని ధ్వ‌జ‌మెత్తారు. ప్ర‌కాశం జిల్లాలో నాలుగేళ్లుగా కరువు విలయ తాండవం చేస్తుందని, 700 అడుగుల లోతు బోరు వేసినా నీరు పడే పరిస్థితి లేదని ఆయన అన్నారు. నీరుపడినా అవి తాగేందుకు ఉపయోగపడటం లేదని వైవీ ఆవేదన వ్యక్తపరిచారు. జిల్లాలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి వెలిగొండ ప్రాజెక్టుకు నిధులు కేటాయించి పనులు వేగవంతం చేశారని, అప్పట్లోనే దాదాపు 70 శాతం పనులు పూర్తయ్యాయని ఆయన అన్నారు. 2014లో అబద్ధపు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన టీడీపీ.. ప్రాజెక్టుకు నిధులు కేటాయించకుండా తీవ్ర జాప్యం చేసిందని ఆయన అన్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో సంక్రాంతి నాటికి జిల్లా ప్రజలకు వెలిగొండ ప్రాజెక్టు నుంచి సాగర్‌ జలాలు అందిస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. హెడ్ రెగ్యులేట‌ర్ పూర్తి చేయ‌కుండా వెలుగొండ ఎలా పూర్తి చేస్తార‌ని ప్ర‌శ్నించారు. వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే వెలిగొండ ప్రాజెక్టు పూర్తవుతుందని, ఆ ప్రాజెక్టు కింద ఉన్న భూములు సస్యశ్యామలం అవుతాయని, ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడే పరిస్థితి ఉండదని ఆయన అన్నారు.  కాగా, సాయంత్రం పాద‌యాత్ర ముగింపు సంద‌ర్భంగా భారీ బ‌హిరంగ స‌భ ఏర్పాటు చేశారు. ఈ స‌భ‌కు జిల్లా న‌లుమూల‌ల నుంచి జ‌నం వేలాదిగా త‌ర‌లివ‌స్తున్నారు. పాద‌యాత్ర‌లో ఎమ్మెల్యే ఆదిమూల‌పు సురేష్‌, రిటైర్డ్ ఐజీ మ‌హ‌మ్మ‌ద్ ఇక్బాల్‌, తదిత‌రులు పాల్గ‌నొ్నారు.
Back to Top