హోదాపై వైఎస్సార్సీపీ గళం

ప్రత్యేక హోదా విషయం మీద
కేంద్రం సూటిగా జవాబు చెప్పటం లేదు. ఆంధ్రప్రదేశ్ కు ఎంతో ముఖ్యమైన ఈ విషయంపై వైఎస్సార్సీపీ
ఎప్పటినుంచో ఉద్యమిస్తోంది. ఇందులో భాగంగా పార్టీ సీనియర్ నాయకులు, ఒంగోలు ఎంపీ
వైవీ సుబ్బారెడ్డి పార్లమెంటులో ఈ విషయాన్ని లేవనెత్తారు. కేంద్ర ప్రభుత్వాన్ని
దీనిపై సూటి గా ప్రశ్నించారు.

అయితే కేంద్రం మాత్రం దీని
మీద సూటిగా స్పందించలేదు. అనేక రాష్ట్రాలు ప్రత్యేక హోదాను అడుగుతున్నాయని
చెప్పుకొచ్చింది. హోదా ప్రస్తావించకుండా ఏపీకి పెద్ద మొత్తంలో నిధులు ఇస్తున్నట్లు
వివరించింది. ప్రత్యేక ప్యాకేజీ కింద రూ. 700 కోట్లు, అమరావతి రాజధాని కింద రూ.
1850 కోట్లు ఇచ్చినట్లు పార్లమెంటు వేదికగా పేర్కొంది. ప్రత్యేక హోదా మీద మాత్రం
దాట వేసింది. 

Back to Top