'యువతకు వైయస్‌ఆర్‌సిపిలో అధిక ప్రాధాన్యం'

రంగారెడ్డి : మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు పేద విద్యార్థులకు వరం అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌  రంగారెడ్డి జిల్లా కన్వీనర్ రాచమల్ల సిద్ధేశ్వ‌ర్ ‌అన్నారు. యువతకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ ‌పార్టీ అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. శంషాబాద్‌లో పార్టీ విద్యార్థి విభాగం మండల కన్వీనర్ ప్రే‌మ్‌కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులు పెద్ద ఎత్తున వై‌యస్‌ఆర్‌సిపిలో చేరారు.

ఈ సందర్భంగా సిద్దేశ్వర్‌ మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్సుమెంట్ పథకంలో లక్షలాది మంది నిరుపేద విద్యార్థులు ఉన్నత విద్య ‌చదువుకున్నారని గుర్తుచేశారు. ప్రస్తుత కిరణ్‌ ప్రభుత్వం పేద విద్యార్థులను పలు రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నదన్నారు. శ్రీ జగన్‌తోనే మహానేత వైయస్‌ఆర్ నాటి సువర్ణ పాలన సాధ్యమవుతుంద‌ని సిద్ధేశ్వ‌ర్ అన్నారు.

తాజా ఫోటోలు

Back to Top