యువభేరి కార్యక్రమం ప్రారంభం

గుంటూరుః యువభేరి కార్యక్రమం ప్రారంభమైంది. వైయస్సార్సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ నల్లపాడు రోడ్డుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా యువత, విద్యార్థులు వైయస్ జగన్ కు ఘనస్వాగతం పలికారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి వైయస్ జగన్ పూలమాల వేసి నివాళులర్పించారు.  విద్యార్థుల జైజగన్ నినాదాలతో యువభేరి ప్రాంగణం మారుమోగింది.  ప్రత్యేకహోదా ఆవశ్యకతపై యువతకు వైయస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.

Back to Top