యువభేరి కార్యక్రమం ప్రారంభం

కర్నూలు జనసంద్రమైంది. ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ కు జిల్లాలో ఘనస్వాగతం లభించింది. నగర శివారు గుత్తి జాతీయ రహదారిలోని యువభేరి ప్రాంగణం చేరుకున్న జననేతకు యువత అపూర్వ స్వాగతం పలికారు. విద్యార్థుల జైజగన్ నినాదాలతో యువభేరి వేదికైన వీజేఆర్ కన్వెన్షన్ సెంటర్ హోరెత్తింది. వైయస్ జగన్ అందరికి అభివాదం చేస్తూ  చిరునవ్వులతో పలకరించారు.  ప్రాంగణం వద్ద మహానేత దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి వైయస్ జగన్ నివాళులర్పించారు. 

ప్రత్యేకహోదా సాధనే ధ్యేయంగా రెండేళ్లుగా పోరాటం కొనసాగిస్తున్న వైయస్ జగన్ యువభేరి కార్యక్రమాల ద్వారా విద్యార్థులను చైతన్యపరుస్తున్నారు. హోదా ప్రాముఖ్యతను విద్యార్థులకు చాటిచెప్పి వారి సందేహాలను నివృత్తి చేయనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని వివరిస్తూ హోదా పోరాటంలో అందరినీ భాగస్వామ్యులను చేస్తున్నారు. వైయస్‌ఆర్‌సీపీ యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, కర్నూలు జిల్లా ఎంపీ బుట్టా రేణుక, పీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకట్‌ రెడ్డి తదితరులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సాదర స్వాగతం పలికారు. 
Back to Top