19న విజయనగరంలో యువభేరి

విజయనగరంః ఈ నెల 19న విజయనగరంలో యువభేరి కార్యక్రమం జరగనుంది.  పూల్ బాగ్ రోడ్డులోని జగన్నాథ ఫంక్షన్ హాల్లో జరిగే యువభేరి కార్యక్రమానికి వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ ముఖ్య అతిథిగా హాజరవుతారని పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి, పార్టీ నేత ధర్మాన కృష్ణదాసు తెలిపారు. యువభేరి కార్యక్రమంలో విద్యార్థులు, యువతకు వైయస్ జగన్ ప్రత్యేకహోదా ఆవశ్యకత గురించి దిశానిర్దేశం చేస్తారని  ప్రకటించారు. అదే రోజు మధ్యాహ్నం ఇటీవల హైదరాబాద్ నానక్ రాం గూడలో భవనం కుప్పకూలిన ఘటనలో చనిపోయిన విజయనగరం వాసులైన మృతుల కుటుంబాలను వైయస్ జగన్ పరామర్శిస్తారని వెల్లడించారు.  

Back to Top