ఈనెల 25న కర్నూలులో యువభేరి

*ఏపీకి ద్రోహం చేసిన బీజేపీ, టీడీపీ
*స్వప్రయోజనాల కోసం హోదాను తాకట్టుపెట్టిన బాబు
*ఐదుకోట్ల ఆంధ్రుల భవిష్యత్తు కోసం వైయస్ జగన్ పోరుబాట
*హోదా కోసం  అలుపెరగని పోరాటం

కర్నూలు :  ప్రత్యేకహోదా కోసం వైయస్సార్సీపీ అలుపెరగని పోరాటం కొనసాగిస్తోంది. హోదా సాధనే ధ్యేయంగా రెండున్నరేళ్లుగా అలసట లేకుండా ఉద్యమిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసపూరిత వైఖరిని ఎండగడుతూ, హోదా పోరాటంలో రాష్ట్ర ప్రజలను చైతన్యవంతులను చేస్తూ ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ ముందుకు సాగుతున్నారు. యువభేరి కార్యక్రమాల ద్వారా విద్యార్థులు, యువతకు హోదా ప్రాముఖ్యతను తెలియజేస్తూ పోరాటపటిమను కొనసాగిస్తున్నారు. 

తిరుపతి, వైజాగ్, కాకినాడ, శ్రీకాకుళం, నెల్లూరు, ఏలూరులో నిర్వహించిన యువభేరి స్ఫూర్తితో ఈనెల 25న కర్నూలులో వైయస్ జగన్ అధ్యక్షతన యువభేరి జరగనుంది.  ఈ నేపథ్యంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నేతలు సమావేశం అయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదా చాలా అవసరమని, పరిశ్రమల అభివృద్ధితో పాటు యువతకు ఉద్యోగాలు వస్తాయని వైయస్ఆర్ సీపీ నేతలు అభిప్రాయపడ్డారు. హోదాను కాదని ప్యాకేజీ కోసం తెలుగు దేశం పార్టీ వెంపర్లాడుతోందని వారు మండిపడ్డారు.

ప్యాకేజీతో తమ జేబులు నింపుకోవడం కోసం బాబు భావితరాల బాగోగులను పక్కనపెట్టారని నేతలు ధ్వజమెత్తారు.  రాష్ట్ర అభివృద్ధి, యువత ఉపాధి కోసం ప్రభుత్వం ఆలోచన చేయకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రత్యేక హోదా కోసం  వైయస్ జగన్ పోరాడుతూనే ఉన్నారని తెలిపారు.ఈ సమావేశంలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, నాగిరెడ్డి, సాయిప్రసాద్ రెడ్డి, ఐజయ్య, రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకట్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Back to Top