22న ఏలూరులో యువభేరి

ఏలూరుః ప్రత్యేకహోదా కోసం వైయస్సార్సీపీ అలుపు లేని పోరాటం కొనసాగిస్తుంది. పార్లమెంట్, తిరుపతి వెంకన్నసాక్షిగా ఇచ్చిన ప్రత్యేకహోదా హామీని తూట్లు పొడిచిన టీడీపీ, బీజేపీల మోసపూరిత వైఖరిని నిరసిస్తూ వైయస్సార్సీపీ ఉద్యమాన్ని తీవ్రతరం చేసింది. ఈనెల 22న పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వైయస్సార్సీపీ  యువభేరి కార్యక్రమం జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై పార్టీ నేతలు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల నాని, తలశిల రఘురాంలు నియోజకవర్గాల కన్వీనర్లతో సమావేశమయ్యారు.  యువభేరి కార్యక్రమానికి ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ముఖ్య అతిథిగా హాజరు అవుతారు.

తాజా ఫోటోలు

Back to Top