ప్రత్యేకహోదాపై విద్యార్థులతో వైఎస్ జగన్ ముఖాముఖి..!

ప్రత్యేకహోదాపై విద్యార్థులతో వైఎస్ జగన్ ముఖాముఖి..!
యువభేరి ఆరంభం..!

తిరుపతిః ప్రత్యేకహోదా సాధన కోసం పోరాడుతున్న యువనాయకులు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతు పలికేందుకు విద్యార్థిలోకం తిరుపతికి పోటెత్తింది. నగరంలోని పీఎల్ఆర్ కన్వెన్షన్ సెంటర్ లో యువభేరి సదస్సు ఆరంభమైంది. ప్రత్యేకహోదా కోసం అసువులు బాసిన అమరులకు 2 నిమిషాల పాటు మౌనం పాటించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సదస్సును ప్రారంభించారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా-విద్యార్థుల అవగాహన సదస్సుకోసం వైఎస్సార్సీపీ నాయకులతో పాటు...రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు తరలివచ్చారు. వైఎస్ జగన్ తో ముఖాముఖి మాట్లాడేందుకు విద్యార్థులు ఉత్సూహకత చూపుతున్నారు. ప్రత్యేకహోదా వల్ల కలిగే ప్రయోజనాల గురించి వైఎస్ జగన్ విద్యార్థులతో  చర్చిస్తున్నారు. 

జననేత కోసం తరలివచ్చిన యువజనం..!
తిరుపతిలో యువభేరిని అడ్డుకునేందుకు ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా యువజనాన్ని ఆపలేకపోయింది. వైఎస్ జగన్ కు జడిసి ఎస్వీ యూనివర్సిటీ ఆడిటోరియంలో యువభేరి సదస్సుకు అనుమతి నిరాకరించడం మొదలు అనేక విధాలుగా ఆటంకాలు సృష్టించాలని కుయుక్తులు పన్నింది. కానీ అవన్నీ బెడిసికొట్టాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోరాటానికి సంఘీభావం తెలపాలన్న సంకల్పంతో ఎస్వీ యూనివర్సిటీ, చిత్తూరు జిల్లాతో పాటు అన్ని జిల్లాల నుంచి విద్యార్థులు తిరుపతి పీఎల్ఆర్ కన్వెన్షన్ సెంటర్ కు తరలివచ్చారు.   
Back to Top