ఇడుపులపాయలో వైయస్సార్‌టీఎఫ్ 5వ వార్షికోత్సవ సభవైయస్సార్ జిల్లా(వేంపల్లె): బాబు అధికారంలోకి వచ్చినాటి నుంచి టీచర్ల సమస్యలు ఏ ఒక్కటీ పరిష్కారం కాలేదని వైయస్సార్ కాంగ్రెస్ టీచర్ల ఫెడరేషన్ (వైయస్సార్‌టీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు కాలిరెడ్డి అన్నారు. ఇవాళ వైయస్సార్‌టీఎఫ్ 5వ వార్షికోత్సవ సభ వైయస్సార్ జిల్లా వేంపల్లె మండలం ఇడుపులపాయ ఎస్టేట్ వద్ద జరిగింది. ఈ సందర్భంగా కాలిరెడ్డి, వైయస్సార్‌టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులపతి మహానేత సమాధి వద్ద పుష్పగుచ్చాలను ఉంచి నివాళులు అర్పించారు. కాలిరెడ్డి మాట్లాడుతూ... వైయస్సార్ అభిమానులకు ఇది పవిత్ర స్థలమని చెప్పారు. వైయస్సార్‌సీపీ అధినేత వైయస్ జగన్ కు అండగా ఉంటామని, టీచర్లకు త్వరలోనే మంచికాలం వస్తుందని వారు పేర్కొన్నారు.
Back to Top